అనిల్ అంబానీకి బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన ఈడీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-01 03:11:23  IST  )

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ఊహించిన షాక్ తగిలింది.

అనిల్ అంబానీకి బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ఊహించిన షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. సుమారు రూ.3 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరు కావాంటూ ఈడీ అధికారులు నోటసులలోపేర్కొన్నారు. కాగా, జులై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్‌నర్స్‌ ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన 35 పైగా కార్యాలయాల్లో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసకున్నారు.

అయితే, ఈడీ దర్యాప్తులో భాగంగా యెస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రూ.3 వేల కోట్ల రుణాలు తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలకు మళ్లించిన అంశంపై దృష్టి సారించింది. రుణం మంజూరు చేయడానికి ముందు యెస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు లంచం రూపంలో నిధులు బదిలీ అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లోన్ మంజూరు బ్యాక్-డేటెడ్ క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్ (CAM) అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)లో కార్పొరేట్ రుణాలు 2017–18లో రూ. 3,742.60 కోట్ల నుంచి 2018–19లో రూ. 8,670.80 కోట్లకు పెరగడం అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తేలింది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ యెస్ బ్యాంక్ యొక్క అడిషనల్ టైర్ 1 (ఏటీ-1) బాండ్లలో రూ.2,850 కోట్ల పెట్టుబడి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన రూ.10 వేల కోట్ల రుణం మళ్లింపు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Rcom)తో కానరా బ్యాంక్‌కు సంబంధించిన రూ.1,050 కోట్ల మోసం కేసుపూ కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story