- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాస్టాగ్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఆ మూడు వాహనాలకు KYC నిలిపివేత
దేశ వ్యాప్తంగా ఉన్న ఫాస్టాగ్ యూజర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) భారీ ఊరట కలిగించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న ఫాస్టాగ్ యూజర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) భారీ ఊరట కలిగించింది. ఇక మీదట కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తాయని NHAI ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో లక్షలాది మంది ఫాస్టాగ్ వాడే వారికి ప్రయోజనం చేకూరనుంది. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జాప్యం జరుగుతున్నట్లుగా NHAI గుర్తించింది. ఈ మేరకు కేవైసీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే, ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదని పేర్కొన్నారు. ఫాస్టాగ్‌ను సరిగా అతికించకపోవడం, దుర్వినియోగం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం పడుతుందని స్పష్టం చేశారు.






