- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇండిగో’ బాధిత ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. రూ.10 వేల వోచర్ల పంపిణీ ప్రారంభం
ఇటీవల విమాన సేవల సంక్షోభం కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు రూ.10 వేల వోచర్ల (Votures) పంపిణీని ఇవాళ ఇండిగో (IndiGo) సంస్థ ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విమాన సేవల సంక్షోభం కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు రూ.10 వేల వోచర్ల (Votures) పంపిణీని ఇవాళ ఇండిగో (IndiGo) సంస్థ ప్రారంభించింది. ఫ్లైట్ బయలుదేరడానికి ముందు 24 గంటల్లోగా సర్వీసు రద్దైన వారికి డీజీసీఏ (DGCA) మార్గదర్శకాల మేరకు ప్రతి ప్రయాణికుడికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారం అందజేస్తున్నారు. అదే విధంగా టికెట్ డబ్బులను ఇప్పటికే ‘ఇండిగో’ రీఫండ్ చేస్తోంది. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న కాంటాక్ట్ వివరాల ఆధారంగా నేరుగా వోచర్ల పంపిణీ జరుగుతోంది. అందరికీ త్వరలోనే వోచర్లు అందుతాయని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ఇక ట్రావెల్ ఏజెంట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుక్ చేసిన వారికి కూడా ఇండిగో వారితో సంప్రదించి వివరాలు సేకరించి వోచర్లు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వోచర్లు అందని వారు జనవరి 1 నుంచి ప్రత్యేక వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకొస్తామని, అర్హత ఉన్నట్లు భావించే వారు తమ ప్రయాణ వివరాలు సమర్పించి వోచర్లు పొందాలని పేర్కొంది.






