US- China: అమెరికా- చైనా మధ్య ముదిరిపోతున్న ట్రేడ్ వార్

by Shamantha N |
US- China: అమెరికా- చైనా మధ్య ముదిరిపోతున్న ట్రేడ్ వార్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ లపై (Trump Tariffs) సంచలన నిర్ణయాలు తీసుకుంన్నారు. చైనాపై ఏకంగా 145 శాతం సుంకాలు విధించారు. దీంతో, అమెరికా- చైనా (USA-China)ల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఈక్రమంలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని అన్నారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు. ఇరు దేశాలు విడిపోయే కారణం ఏదీ లేదని పేర్కొన్నారు.

అమెరికా- చైనాపై సుంకాలు..

అమెరికా చైనా (China) వస్తువులపై 145 శాతం సుంకం విధించగా.. డ్రాగన్‌ కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అగ్రరాజ్యం వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. ట్రంప్ ప్రతీకార చర్యలు చేపట్టింది. రక్షణ, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఉపయోగించే అరుదైన ఖనిజాల్లో 90 శాతం డ్రాగన్‌ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్‌ నిలిపివేసింది. మరోవైపు, టారీఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు.



Next Story

Most Viewed