సైఫ్ అలీ ఖాన్‌కు హైకోర్టు షాక్.. ఆయన రూ.1500 కోట్ల ఆస్తులు ప్రభుత్వానివే..

by Sujitha Rachapalli |

హీరో సైఫ్ అలీఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పటౌడీ ఫ్యామిలీకి చెందిన రూ. 1500 కోట్ల ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా డిక్లేర్ చేసింది. సైఫ్ బాల్యంలో పెరిగిన ఇంటితో సహా ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్

సైఫ్ అలీ ఖాన్‌కు హైకోర్టు షాక్.. ఆయన రూ.1500 కోట్ల ఆస్తులు ప్రభుత్వానివే..
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో సైఫ్ అలీఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పటౌడీ ఫ్యామిలీకి చెందిన రూ. 1500 కోట్ల ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా డిక్లేర్ చేసింది. సైఫ్ బాల్యంలో పెరిగిన ఇంటితో సహా ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్ కూడా శత్రు ఆస్తిగా పరిగణించబడింది. అంటే ఈ ఆస్తి మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీగా మారుతుంది. కాగా ఈ తీర్పు సైఫ్ గ్రాండ్‌మదర్ సాజిదా సుల్తాన్‌కు అనుకూలంగా 25 సంవత్సరాల క్రితం వచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది.

అసలు కథేంటి??

భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు.. అబిదా సుల్తాన్, సాజిదా సుల్తాన్, కమర్ తాజ్ రబియా సుల్తాన్. అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్లడంతో ఈ ఆస్తులను 1968 శత్రు ఆస్తి చట్టం ప్రకారం శత్రు ఆస్తిగా ప్రకటించారు. అయితే సాజిదా సుల్తాన్ భారత్‌లోనే ఉండి, నవాబ్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడిని వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ ఆస్తుల్లో వాటాను సంక్రమించుకున్నారు. 2014లో శత్రు ఆస్తుల సంరక్షక విభాగం ఈ ఆస్తులను శత్రు ఆస్తిగా ప్రకటించింది. 2015లో సైఫ్, అతని కుటుంబం దీనిని సవాలు చేయగా హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. డిసెంబర్ 13, 2024న జస్టిస్ వివేక్ అగర్వాల్ 2015 స్టేను ఎత్తివేసి, 30 రోజుల్లో అప్పీలేట్ అథారిటీకి రిప్రెజెంటేషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. జూన్ 30, 2025న, 2000లో సాజిదా సుల్తానాను ఏకైక వారసురాలిగా గుర్తించిన ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆస్తులు ముస్లిం వ్యక్తిగత చట్టం (షరియత్) ప్రకారం విభజన కావాలని.. రాజవంశ స్థాన వారసత్వంపై కాదని తీర్పు చెప్పింది. కేసు మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపబడింది.

Next Story