- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. CBSC క్లాస్ 12 రీ-ఇవాల్యుయేషన్ ప్రారంభం
సీబీఎస్‌ఈ క్లాస్ 12 రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియ ఇవాళ ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్ 12 ఫలితాల వెల్లడి తర్వాత తలెత్తిన తీవ్ర వివాదాల మధ్య, విద్యార్థుల మార్కుల రీ-ఇవాల్యుయేషన్ (Re-evaluation) ప్రక్రియను బోర్డు ఇవాళ్టి నుంచి అధికారికంగా ప్రారంభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM), డిజిటల్ మూల్యాంకన విధానంలో భారీగా తప్పులు జరిగాయంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిజిటల్ మార్కింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆశించిన మార్కులు రాలేదని, కొందరికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ఈ రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
అయితే, ఈ ఏడాది దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రికార్డు స్థాయిలో దాదాపు 11 లక్షల జవాబు పత్రాల (Answer Scripts) స్కాన్ చేసిన కాపీల కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మూల్యాంకనంలో చాలా చోట్ల కౌంటింగ్ తప్పులు జరిగాయని, కొన్ని సమాధానాలను పూర్తిగా వదిలేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదట్లో రీ-ఇవాల్యుయేషన్ కోసం బోర్డు భారీగా ఫీజులను నిర్ణయించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యంతో రీ-ఇవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ ఫీజులను గణనీయంగా తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.






