- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కాలర్‌షిప్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కేంద్ర సామాజిక న్యాయం, అధికారీకరణ మంత్రిత్వ శాఖ 2024-25 అకడమిక్ సంవత్సరానికి గాను ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్’కు సవరించిన మార్గదర్శకాలను ఇవాళ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర సామాజిక న్యాయం, అధికారీకరణ మంత్రిత్వ శాఖ 2024-25 అకడమిక్ సంవత్సరానికి గాను ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్’కు సవరించిన మార్గదర్శకాలను ఇవాళ విడుదల చేసింది. ఈ స్కీమ్ ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) విద్యార్థులకు టాప్ ఇన్‌స్టిట్యూట్లలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి రూపొందించారు. ఒకపై పూర్తి ట్యూషన్ ఫీజు, ఇతర రుసుములను నేరుగా విద్యార్థుల అకౌంట్లలోకి బదిలీ చేయనున్నారు.
ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షలతో పాటు హాస్టల్, బుక్స్, ల్యాక్స్‌టాప్‌ల కోసం తొలి ఏడాది రూ.80 వేలు, ఆ తర్వాత విడతల వారీగా రూ.41 వేల చొప్పున అందజేయనున్నారు. పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా పథకాన్ని రెన్యూవల్ చేస్తారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఎన్ఐడీ, ఐహెచ్ఎం వంటి సంస్థల్లో ప్రవేశం పొందిన వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. అర్హత గల విద్యార్థినీ విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా తమ దరఖాస్తును అందజేయవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ socialjustice.gov.inలో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్నాయి.






