ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. టికెట్ల ధరలపై ఎయిరిండియా కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ఇండిగో (Indigo) సంక్షోభం వేళ ప్రముఖ విమానయాన సంస్థలు చార్జీలను విపరీతంగా పెంచడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. టికెట్ల ధరలపై ఎయిరిండియా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో (Indigo) సంక్షోభం వేళ ప్రముఖ విమానయాన సంస్థలు చార్జీలను విపరీతంగా పెంచడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చార్జీలను అడ్డగోలుగా పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలపై ఎయిరిడియా (Air India) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎకానమీ క్లాస్ టికెట్ల బేస్ ఫేర్‌పై పరిమితి విధించనున్నట్లు స్పష్టం చేసింది. తాజా పరిణామంతో ఎకానమీ క్లాస్ బేస్ ఫేర్‌కు క్యాప్ విధించనున్నారు. ఈ నిర్ణయం మరికొన్ని గంటల్లోనే అమల్లోకి వస్తుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.అయితే, ఈ ప్రక్రియలో థర్డ్ పార్టీ సిస్టమ్‌లపై ఆధారపడటం ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల బుకింగ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎకానమీ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ బేస్ ఫేర్ చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story