- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 8 ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా మరో కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం ఎనిమిది జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. వరుసగా ఫ్లైట్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎంపిక చేసిన వాటికి మెయిన్‌టెనెన్స్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించిననట్లుగా ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ఇందులో అంతర్జాతీయ సర్వీసులు AI906 (దుబాయ్-చెన్నై), AI308 (ఢిల్లీ-మెల్బోర్న్), AI309 (మెల్బోర్న్-ఢిల్లీ)తో పాటు AI2204 (దుబాయ్-హైదరాబాద్) సర్వీసులు రద్దు కానున్నాయి. ఇక దేశీయం AI874 (పూణే-ఢిల్లీ), AI456 (అహ్మదాబాద్-ఢిల్లీ), AI2872 (హైదరాబాద్-ముంబై)తో పాటు AI571 (చెన్నై-ముంబై) సర్వీసులను నిలిపివేశారు. కాగా, బుధవారం కూడా ఎయిరిండియా రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అందులో AI188 (టొరంటో-ఢిల్లీ) AI996 (దుబాయ్-ఢిల్లీ) సర్వీసులు ఉన్నాయి.






