PM KISAN YOJANA: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ యోజనలో మార్పులు

by Yella Dhawani Reddy |

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందజేస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) ఒకటి.

PM KISAN YOJANA: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ యోజనలో మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందజేస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. 2000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతుంది. ఇక పీఎం-కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. తాజాగా పథకం లబ్ధిపొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పు చేసింది.

పలు కారణాలతో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమకావటం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది. డబ్బులు పడని రైతులు నేరుగా వెళ్లి నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లేదా మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌లో కూడా ఆ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుతో రైతులకు భారీ ఉపశమనం కలుగుతుంది. ఇక నోడల్ ఆఫీసర్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఎలా తెలుసుకోవచ్చు అంటే..

* ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inకి వెళ్లాలి.

* అనంతరం ఫార్మర్ కార్నర్‌కి వెళ్లి, సెర్చ్ యువర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

* అక్కడ రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

ఇప్పటి వరకు రైతులకు పీఎం కిసార్ యోజన ద్వారా 19వ విడతల్లో నగదు జమ అయింది. ఇక 20వ విడత జూన్ 2025లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అందులో 2.4 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు.

Next Story