RTC ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. బస్సు ఛార్జీలు పెంపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-25 11:16:29  IST  )

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు(RTC Bus) ఛార్జీలు(Charges) పెరిగాయి.

RTC ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. బస్సు ఛార్జీలు పెంపు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు(RTC Bus) ఛార్జీలు(Charges) పెరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. హకీమ్ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకారం బస్సు ఛార్జీల పెంపుదలకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరపై 14.95శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి(జనవరి 25) నుంచే అమల్లోకి వచ్చాయి.

ఈ పెంపు ఫలితంగా MSRTC బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 15,000 బస్సుల భారీ ఫ్లీట్ కలిగిన MSRTC నిర్వహించే అన్ని రూట్లకు ఛార్జీల పెంపు వర్తిస్తుంది. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే.

Next Story