- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG Alert: వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేడు ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు బంద్
యాప్ ఆధారిత రవాణా సేవలపై ఆధారపడే ప్రయాణికులకు ఇవాళ ఇబ్బందులు తప్పేలా లేవు.

దిశ, వెబ్‌డెస్క్: యాప్ ఆధారిత రవాణా సేవలపై ఆధారపడే ప్రయాణికులకు ఇవాళ ఇబ్బందులు తప్పేలా లేవు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా (Ola), ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ (TGPWU) నేతృత్వంలో ఈ ‘ఆలిండియా బ్రేక్‌డౌన్’ పేరుతో నిరసన కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు ఉదయం నుంచి క్యాబ్‌లు, ఆటోలు, బైక్ టాక్సీలు రోడ్డెక్కే అవకాశం లేదు.
డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే..
డ్రైవర్లు ప్రధానంగా కంపెనీల ధరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రభుత్వం వెంటనే కనీస బేస్ ధరలను (Minimum Base Fares) అధికారికంగా ప్రకటించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలు ఒక్కో రైడ్‌పై 25 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సొంత అవసరాల కోసం వాడే (White Plate) వాహనాలను కమర్షియల్ పనుల కోసం వాడటాన్ని కఠినంగా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పింఛను వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు.






