Jeo Biden : చివరి క్షణంలో ట్రంప్ కు షాక్

by M.Rajitha |
Jeo Biden : చివరి క్షణంలో ట్రంప్ కు షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు(President of America) జో బైడెన్(Jeo Biden) మరి కొద్ది గంటల్లో అధ్యక్ష పదవి నుంచి దిగబోతున్న విషయం తెలిసిందే. కాగా పదవి నుంచి వెళ్తూ వెళ్తూ బైడెన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కు షాకిచ్చారు. పలువురు కీలక వ్యక్తులకు క్షమాభిక్ష ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేగుతోంది. వైద్య నిపుణులు, కోవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా.ఆంథోనీ ఫౌచి, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లెతో పాటు క్యాపిటల్ హిల్ పై దాడుల ఘటనపై విచారణను ఎదుర్కొంటున్న హౌస్ కమిటీ సభ్యులకు తనకున్న అసాధారణ అధికారాలతో బైడెన్ ముందస్తు క్షమాభిక్ష ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించిన తరువాత ఇక వారిపై ఎలాంటి విచారణ గాని, శిక్ష అమలు చేయడం గాని ఉండదు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న ట్రంప్ ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

Advertisement

Next Story

Most Viewed