- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhupesh Baghel: బెట్టింగ్ యాప్ స్కామ్.. మాజీ సీఎంపై సీబీఐ ఎఫ్ఐఆర్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app) కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్ది దారుల్లో బఘేల్ ఒకరని తెలిపింది. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు ఉండగా ఆరో నిందితుడిగా బఘేల్‌ను చేర్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సీబీఐ త్వరలోనే ఆయనను విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా భూపేశ్ సహా నిందితులందరికీ చెందిన 60 ప్రదేశాలపై సీబీఐ దాడులు చేసింది. అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారుల ప్రాంగణాల్లో సోదాలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా పలు డిజిటల్, డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే బఘేల్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.
కాగా, మహాదేవ్ యాప్ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీనిని రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రమోట్ చేస్తున్నారు. అయితే భూపేశ్ బఘేల్ పదవీకాలంలో మహాదేవ్ యాప్‌కు రక్షణ కల్పించారని ఆరోపణలున్నాయి. దీనికి బదులుగా ఆయన రూ.508 కోట్లు తీసుకన్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ కేసుపై గత ఏడాదిన్నర కాలంగా విచారణ కొనసాగుతోంది. అయితే భూపేశ్ బఘేల్ ఈ ఆరోపణలను బఘేల్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.






