- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatia: ఈసీపై నమ్మకం లేకుంటే రాహుల్ రాజీనామా చేయాలి.. బీజేపీ డిమాండ్
రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి భాటియా డిమాండ్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) డిమాండ్ చేశారు. ఈసీపై రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపారు. భాటియా శనివారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ ప్రకటనపై ఈసీ ఎవిడెన్స్ అడిగితే ఇవ్వడానికి నిరాకరించారన్నారు. ఎన్నికల సంఘం నిజాయితీపై ఎటువంటి సందేహం లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందని, పారదర్శకం సంస్థగా అనేక సంవ్సరాలుగా ఈసీ తన ఖ్యాతిని పెంచుకుందని చెప్పారు.
ఎలక్షన్ కమిషన్ (Election commission) పై విశ్వసనీయత లేకపోతే రాహుల్, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా రిజైన్ చేయాలన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఫలితాలను అంగీకరించి వ్యతిరేకత ఉన్న చోట తిరస్కరిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. రాహుల్ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ కోరితే ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కాగా, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాటియా స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.






