- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhargavastra: ఇక పాక్ డ్రోన్లకు చుక్కలే.. భార్గవాస్త్ర ప్రయోగం సక్సెస్
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ తన భద్రతను బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ (Pakisthan)తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ తన భద్రతను మరింత బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే బుధవారం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ (Counter drone system) భార్గవాస్త్ర (Bhargavasthra) ను విజయవంతంగా పరీక్షించింది. ఇది ఒకేసారి అనేక డ్రోన్‌లను ఢీకొట్టగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ కోసం మూడు పరీక్షలు జరగగా.. ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా రెండు పరీక్షలు చేపట్టారు. అనంతరం రెండు సెకన్లలోపు సాల్వో మోడ్‌లో రెండు రాకెట్లను ప్రయోగించారు. ఈ నాలుగు రాకెట్లు వాటికి విధించిన టార్గెట్ చేధించాయని అధికారులు తెలిపారు. దీంతో దేశ రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడినట్టు అయింది.
పది కిలోమీటర్ల దూరం నుంచే శత్రు డ్రోన్ల గుర్తింపు
భార్గవాస్త్ర అనేది బహుళ-పొరల యాంటీ-డ్రోన్ వ్యవస్థ. ఇది వేగంగా సమీపించే బహుళ డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగలదు. డ్రోన్ల ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ ఎంతో సహాయపడుతుంది. దీనిని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) రూపొందించింది. భార్గవస్త్ర 2.5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చే చిన్న డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగలదు. అలాగే రాకెట్‌లోని కొత్త టెక్నాలజీతో నిర్మించబడిన రాడార్ ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే చిన్న గగనతల ముప్పులను గుర్తించగలదు. సముద్ర మట్టానికి 5,000 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలతో సహా విభిన్న భూభాగాల్లో దీనిని సజావుగా మోహరించొచ్చు.
డ్రోన్ల ముప్పును అడ్డుకునేందుకే
భార్గవస్త్ర అనేది తక్కువ ఖర్చుతో కూడిన ఎంట్రీ డ్రోన్ వ్యవస్థ. అంటే డ్రోన్‌ను నేరుగా నాశనం చేయగలదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లోని అనేక చోట్ల డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. అంతేగాక డ్రోన్ల ముప్పు నిరంతరం ప్రమాదంగా మారుతోంది. ఈ పరిస్థితిలో వీటిని అడ్డుకునేందుకు భార్గవాస్త్ర ఉపయోగకరంగా ఉంటుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.






