- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 10న భారత్ బంద్.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపడుతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులను ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కీలక నేత నంబాల కేశవరావు, దళ సభ్యుల మృతికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల స్మారక సభలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారని వారు పేర్కొన్నారు. తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపడం లేదని అన్నారు. గత రెండు నెలలుగా సంయమనం పాటించామని.. కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నామని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇవాళ లేఖను విడుదల చేశారు.
నిర్లజ్జగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రకటన..
మే 21 భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజన లేఖలో ప్రస్తావించారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు, రక్తపిపాసులు, దేవ నరహంతుకులైన ప్రధాని, కేంద్ర హోంమంత్రి మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారని ఆరోపించారు. భారత సైన్యం, పారా మిలటరీ, కమాండో బలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు నారాయణపూర్ మాడ్ ప్రాంతంలో చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సమా పీఎల్‌జీఏకు చెందిన వివిధ స్థాయి నాయకత్వ కామేడ్లను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ హత్యాకాండను కొనసాగించిన భద్రతా దళాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్లజ్జగా చారిత్రాత్మక విజయమంటూ ప్రకటించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జూన్ 10న భారత్ బంద్ పాటించాలని దేశ ప్రజానికానికి పిలపునిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారక సభలు జరపాల్సిందిగా పిలుపునిస్తున్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖలో వెల్లడించింది.






