బెజోస్ ఓ కాపీక్యాట్: ఎలాన్ మస్క్

by Muthe.Rajitha |

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్ పై ఎలాన్ మస్క్ నోరు జారాడు.

బెజోస్ ఓ కాపీక్యాట్: ఎలాన్ మస్క్
X

దిశ, వెబ్ డెస్క్: అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్ పై ఎలాన్ మస్క్ నోరు జారాడు. కొత్త AI ఫ్లాట్ ఫామ్ తో సహా, కంప్యూటర్లు, ఏరోస్పేస్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో AI ఉత్పత్తులు తీసుకు వస్తున్నామని ఇటీవల బెజోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై X అధినేత, టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యంగాస్త్రాలు విసిరాడు. జెఫ్ బెజోస్ కలలు కంటున్నారని, ఆయన ఓ కాపీక్యాట్ అంటూ పోస్ట్ పెట్టాడు.

కాగా AI, ఏరోస్పేస్, శాటిలైట్ ఇంటర్నెట్ వంటి రంగాల్లో వీరి ఇరువురి మధ్య తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. పలు రంగాల్లో బెజోఫ్, మస్క్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ.. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అయితే బెజోఫ్ మీద మస్క్ గతంలో కూడా ఇలాంటి విమర్శలు చేశారు.

Next Story