Benjamin Netanyahu : గాజాను హమాస్ నుంచి విముక్తి చేస్తాం.ఆక్రమణ మా ఉద్దేశం కాదు

by Phanindra |   (  Updated:2025-08-09 15:12:04  IST  )

గాజాను హమాస్ నుంచి విముక్తి చేస్తామని, ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

Benjamin Netanyahu : గాజాను హమాస్ నుంచి విముక్తి చేస్తాం.ఆక్రమణ మా ఉద్దేశం కాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజా సిటీని ఆక్రమించుకునే ప్లాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపడం విమర్శలకు దారితీసింది. స్వదేశంతోపాటు విదేశాలు కూడా ఇజ్రాయెల్ విధానాన్ని తప్పుబట్టాయి. ఇది మరో యుద్ధ నేరం అని హమాస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ మద్దతుగా ఉండే జర్మనీ కూడా ఆ దేశానికి మిలిటరీ ఎగుమతులు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.ఇది హమాస్‌కు జర్మనీ ఇచ్చిన బహుమతి అని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తంచేశారు.

తమ కొత్త ప్లాన్ ప్రకారం గాజా సిటీని ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమించినప్పటికీ.. యుద్ధ జోన్‌లకు వెలుపల ఉన్న సామాన్యులకు ఆహారం ఇతర సహకారం అందిస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. ‘మేం గాజాను ఆక్రమించబోవడం లేదు. మేం జస్ట్ గాజాను హమాస్ నుంచి విముక్తి చేయబోతున్నాం అంతే’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇలా చేయడంతోపాటు గాజాలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమ హోస్టేజ్‌లను విడిపించుకోవడం కూడా సులభం అవుతుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

యుద్ధ రంగానికి దూరంగా పుతిన్-ట్రంప్ భేటీ: జెలెన్‌స్కీ

Next Story