ట్రంప్‌ను డీల్ చేయటం ఎలాగో మోడీకి చెప్తా: నెతన్యాహు

by Phanindra |

ట్రంప్‌ను డీల్ చేయటం ఎలాగో మోడీకి తాను చెప్తానని, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కొన్ని సలహాలిస్తానని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

ట్రంప్‌ను డీల్ చేయటం ఎలాగో మోడీకి చెప్తా: నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అదనపు సుంకాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా డీల్ చేయాలో ప్రధాని మోడీకి సలహా ఇస్తానని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్‌ ఇద్దరూ నాకు అద్భుతమైన మిత్రులు. అందుకే ట్రంప్‌తో వ్యవహరించే విషయంలో మోడీకి కొన్ని సలహాలు ఇస్తా. అయితే ఆ విషయాలు వ్యక్తిగతంగా మాత్రమే చెబుతా’’ అని నెతన్యాహు అన్నారు.

భారత్‌-యూఎస్ బంధం చాలా బలమైందని, ఈ సుంకాల సమస్యను కూడా త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. త్వరలోనే భారత్‌లో పర్యటించాలని కూడా ఉందన్నారు. ‘భారత్, అమెరికా సంబంధాల పునాదులు చాలా బలమైనవి. సుంకాల సమస్యను త్వరగా పరిష్కరించుకోవడం ఇరుదేశాలకు మంచిది. అలా జరిగితే మాక్కూడా మంచిదే.. ఎందుకంటే ఈ రెండు దేశాలు మాకు మిత్రులు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.

Next Story