- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Burn my resume: ఉచితంగా పని చేస్తా.. ఉద్యోగమివ్వండి.. జాబ్ కోసం ఓ టెకీ వినూత్న నిర్ణయం
నా రెజ్యూమ్ కాల్చండి.. కానీ సహాయం చేయండి అంటూ ఓ బెంగళూరు టెకీ జాబ్ వినూత్న ప్రయత్నం చేశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఓ బెంగళూరుకు చెందిన ఓ టెకీ పోస్ట్ చూస్తే అర్థమైపోతదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నా రెజ్యూమ్ కాల్చండి.. కానీ సహాయం చేయండి అంటూ ఓ బెంగళూరు టెకీ జాబ్ వినూత్న ప్రయత్నం చేశాడు. 2023లో ఇంజినీరింగ్ పూర్తయినా తనకు ఉద్యోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రెడిట్‌లో తన రెజ్యూమ్ పోస్ట్ చేశాడు. ఇన్ఫర్మేషన్ సైన్స్&ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా పొందినట్లు.. తన రెజ్యూమ్ వెర్షన్‌ను పోస్ట్ చేస్తూ పంచుకున్నాడు. జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ ఏపీఐ డెవలపర్, ఏఐ మోడల్స్ డెవలప్ లాంటి తదితర కోర్సుల్లో తనకు ప్రావీణ్యం ఉందని వెల్లడించాడు.
కానీ ప్రస్తుతం ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే తన స్కిల్ మెరుగు పరుచుకోడానికి, రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కోసం.. వర్క్ ఫ్రమ్ హోం (రిమోట్) ద్వారా తాను ఎలాంటి శాలరీ తీసుకోకుండా ఉచితంగా జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. దీంతో అతడి పోస్ట్ చూసిన కొందరు యూజర్లు మార్గనిర్దేశం చేస్తున్నారు. మీ సీవీ నాకు మెయిల్ చేయండని కొంత మంది యూజర్లు కామెంట్స్ పెట్టారు. ఇక, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు అడుగుతున్నావని ఓ నెటిజన్ ప్రశ్నకు అతను సమాధానం ఇస్తూ.. ‘మా అంకుల్‌కు ప్రమాదం జరిగింది. ఎనిమిది పక్కటెముకలు విరిగిపోయాయి. కాబట్టి నేను ఇక్కడే ఉండాలి’ అని అతను వివరించాడు. నీకు త్వరగా ఉద్యోగం దొరుకుతుందని నెటిజన్లు అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.






