Bengaluru Stampede : బెంగుళూరు తొక్కిసలాట ఘటన.. నలుగురికి రిమాండ్

by Muthe.Rajitha |

బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో నలుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Bengaluru Stampede : బెంగుళూరు తొక్కిసలాట ఘటన.. నలుగురికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో నలుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ(Victory Parade) సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులుగా RCB, DNA ఈవెంట్ మేనేజ్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA)లపై కేసు నమోదైంది.

ఈ కేసులో బెంగళూరు పోలీసులు నేడు నలుగురిని అరెస్టు చేసి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(ACMM) కోర్టులో హాజరుపరిచారు. ఈ నలుగురికి14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది న్యాయస్థానం. అరెస్టయిన వారిలో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, DNA ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్ ఉన్నారు. కాగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Next Story