- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stampede : బెంగుళూరు తొక్కిసలాట ఘటన.. రంగంలోకి CID
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన(Bengaluru Stampede) గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన(Bengaluru Stampede) గురించి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ విజయోత్సవ పరేడ్(Victory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి, విచారణను ప్రారంభించి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID)కి బదిలీ చేసింది.
విచారణ కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బెంగుళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆర్సీబీ, ఈవెంట్ మేనేజర్ DNA నెట్‌వర్క్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA) అడ్మినిస్ట్రేటివ్ కమిటీపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద పలు కేసులు నమోదయ్యాయి. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జగదీష్ జి. నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణ కూడా జరుగుతోంది. ఈ ఎంక్వైరీ 15 రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.






