- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట.. RCB కి బిగ్ షాక్
బెంగుళూరు తొక్కిసలాట ఘటన(Bengaluru Stampede) వ్యవహారంలో కర్ణాటక సర్కారుపై హైకోర్టు(Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు తొక్కిసలాట ఘటన(Bengaluru Stampede) వ్యవహారంలో కర్ణాటక సర్కారుపై హైకోర్టు(Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును గురువారం సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వంపై సీరియస్ అయింది. వేల సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా స్టేడియం వద్ద ఎందుకు అంబులెన్సులు ఏర్పాటు చేయలేదని, కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ఈవెంట్ నిర్వహించడం ఏంటని మండిపడింది. తొక్కిసలాట ఘటనపై ఈనెల 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు, ఆర్సీబీ యాజమాన్యానికి, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో RCB యాజమాన్యం, క్రికెట్ అసోసియేషన్ పై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద బెంగుళూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. విక్టరీ పరేడ్ ఉందంటూ జట్టు యాజమాన్యం చేసిన పోస్టులపై కూడా విచారణ జరగనుంది.
కాగా, బుధవారం బెంగుళూరు చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. స్వయంగా బాధితులను పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందిచి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. RCB యాజమాన్యం రూ.10 లక్షలు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.
ర్యాలీపై సోషల్ మీడియాలో RCB వరుస అప్డేట్స్.. విచారణకు ఆదేశం






