Bengaluru Stampede : ర్యాలీపై సోషల్ మీడియాలో RCB వరుస అప్డేట్స్.. విచారణకు ఆదేశం!

by Muthe.Rajitha |   (  Updated:2025-06-05 12:41:18  IST  )

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన(Benguluru Stampede) గురించి తెలిసిందే.

Bengaluru Stampede : ర్యాలీపై సోషల్ మీడియాలో RCB వరుస అప్డేట్స్.. విచారణకు ఆదేశం!
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన(Benguluru Stampede) గురించి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ విజయోత్సవ పరేడ్(Victory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు ఆర్సీబీ సోషల్ మీడియా పోస్టులు(RCB Social Media Posts) కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. విజయోత్సవ ర్యాలీ గురించి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్సీబీ యాజమాన్యం వరుస అప్డేట్స్ పెట్టి సోషల్ మీడియాలో ర్యాలీపై హోరెత్తించింది. రోడ్ షోను అందరూ ఎంజాయ్ చేసేలా మార్గదర్శకాలు పాటించాలని సూచించడంతో.. తప్పకుండా ర్యాలీ ఉంటుందనే భావనతోనే స్టేడియం వద్దకు అభిమానులు పోటెత్తినట్టు విమర్శలు వస్తున్నాయి.

ఆర్సీబీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ దుర్ఘటనకు కారణమనే వార్తలు వస్తుండటంతో కర్ణాటక సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ జట్టు యాజమాన్యాన్ని కూడా విచారించనున్నట్టు సమాచారం. ర్యాలీ భద్రతా దృష్ట్యా పరేడ్ వాయిదా వేసుకోవాలని జట్టుకు, ప్రభుత్వానికి సూచించిన పోలీసులు మాత్రం తొక్కిసలాట ఘటనపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.

Next Story