బెంగళూరు తొక్కిసలాట కేసు.. RCB అధికారికి హైకోర్టులో చుక్కెదురు

by Kema Shiva Kumar |

బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి గాయలైన విషయం తెలిసిందే.

బెంగళూరు తొక్కిసలాట కేసు.. RCB అధికారికి హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి గాయలైన విషయం తెలిసిందే. ఈ మేరకు తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకున్న కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి.. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆర్‌సీబీ (RCB) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, ఈవెంట్ ఆర్గనైజర్ DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)పై BNS యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో కేసులో అరెస్ట్ అయిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనలే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్ నిఖిల్ సోనలేకు తాత్కాలిక ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. అదేవిధంగా రేపటి వరకు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది.

Next Story