Prajwal Revanna: అత్యాచారం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-02 11:32:52  IST  )

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జీవితఖైదు (Life Sentence) విధించింది.

Prajwal Revanna: అత్యాచారం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జీవితఖైదు (Life Sentence) విధించింది. పనిమనిషిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో అతనికి జీవితఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి సంతోష్ గజానన హెగ్డే తీర్పు వెలువరించారు. అలాగే బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా.. 2021లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రాగా.. రేప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ 2024, మే 21న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పలువురు మహిళలు సైతం ప్రజ్వల్ తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. విచారణలో భాగంగా ప్రజ్వల్ ఫోన్ ను తనిఖీ చేయగా రెండు వేలకు పైగా వీడియోలు బయటపడ్డాయి. 14 నెలల రిమాండ్ తర్వాత బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది.

శుక్రవారం (ఆగస్టు 1) ఈ కేసు విచారణ పూర్తవ్వగా.. తనకు తక్కువ శిక్ష వేయాలని ప్రజ్వల్ న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా ఏడ్చాడు. కాగా.. 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పీఎస్ లో కేఆర్ నగర్ కు చెందిన బాధిత మహిళ (47) ప్రజ్వల్ పై రేప్ కేసు పెట్టింది. గన్నిగడ ఫాంహౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆపై మరికొందరు కూడా ప్రజ్వల్ పై అత్యాచారం ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

Next Story