- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌కు ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ అవసరం.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ అవశ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ రావడం అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మేదినీపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కలిసి పనిచేస్తేనే బెంగాల్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బెంగాల్ అభివృద్ధి ప్రధానిపై ద్వేషం పెంచుకోవడంలో లేదని, సమన్వయంతో పనిచేయడంలో ఉందని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే మత్స్య సంపద, సీఫుడ్ రంగాల్లో బెంగాల్ స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత, మత్స్యకారులు, వారి కుటుంబాల అవసరాలను తీర్చడానికి తమ ప్రభుత్వమే తొలిసారిగా ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను (Ministry of Fisheries) ఏర్పాటు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. బ్లూ ఎకానమీ వృద్ధి కోసం ఈ చర్య తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మత్స్యకారుల కోసం మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్ కేటాయింపులు చేశామని అన్నారు. మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) సౌకర్యం కల్పించి ఆర్థిక వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించామని, ఇప్పటికే లక్షలాది మంది దీనితో లబ్ధి పొందారని తెలిపారు. ఒక్కసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రాష్ట్రంలో అత్యంత వేగంగా, పారదర్శకతతో అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ హామి ఇచ్చారు.






