బెంగాల్‌ సర్కార్ కీలక నిర్ణయం: ఇక మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-21 11:09:08  IST  )

పశ్చిమ బెంగాల్‌లోని సువేందు అధికారి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది.

బెంగాల్‌ సర్కార్ కీలక నిర్ణయం: ఇక మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ప్రభుత్వ మారిన నేపథ్యంలో పాలనా వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు.. తాజాగా రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో తరగతులు ప్రారంభం కావడానికి ముందు జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ ఉత్తర్వులలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎయిడెడ్ మదర్సాల్లో ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులందరూ తప్పనిసరిగా వందేమాతరం పాడాలని పేర్కొన్నారు.

అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం పాడాలని తెచ్చిన రూల్‌కు కొనసాగింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రభుత్వ తాజా నిర్ణయంపై బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ ఉత్తర్వులను తీవ్రంగా తప్పుపట్టారు. సొంత నిధులతో నడిచే స్వతంత్ర మదర్సాలపై ఇలాంటి నిబంధనలను బలవంతంగా రుద్దకూడదని వాదిస్తున్నారు.

Next Story