ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బెంగాల్ CM

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం అందజేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బెంగాల్ CM
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం అందజేశారు. కాగా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ సువేందు అధికారి విజయం సాధించారు. నందిగ్రామ్, భవానీపూర్ అనే రెండు కీలక స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2021లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు, 2026లో కూడా ఆమెను ఓడించి, వరుసగా రెండుసార్లు ఆమెకు షాక్ ఇచ్చారు. ఈ చారిత్రాత్మక విజయంతో, పశ్చిమ బెంగాల్‌కు మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. రెండు చోట్లా ఎమ్మెల్యేగా ఉండటానికి అవకాశం లేకపోవడంతో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు.

కాగా, 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్ల భారీ మెజారిటీతో విజయం సాధించంది. దీంతో 2011 నుంచి బెంగాల్‌లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. ఇక ప్రజా సేవకే అంకితం కావాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా, బ్రహ్మచారిగా ఉంటున్న 55 ఏళ్ల సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Next Story