బళ్లారి కాల్పుల ఘటన.. ఎస్పీ పవన్ నిజ్జూర్‌పై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 06:38:28  IST  )

కర్ణాటక (Karnataka)లోని బళ్లారి (Bellary) నగరం కాల్పులతో రణరంగంగా మారిన విషయం తెలిసిందే.

బళ్లారి కాల్పుల ఘటన.. ఎస్పీ పవన్ నిజ్జూర్‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లోని బళ్లారి (Bellary) నగరం కాల్పులతో రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు విషయంలో రెండు మధ్య ఘర్షణతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో వైఫల్యం చెందారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ పవన్ నిజ్జూర్‌ (SP Pawan Nijjur)‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, పవన్ నిజ్జూర్ గురువారమే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఛార్జ్ తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇంతటి తీవ్ర పరిణామం జరగడం, దానిపై ఆయన సస్పెండ్ కావడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. శాంతిభద్రతలను కాపాడటంలో ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయడంలో ఆయన విఫలమయ్యారని ప్రభుత్వం పేర్కొంది.

కాగా, బళ్లారిలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హవంబభావి ప్రాంతంలో బ్యానర్లు కట్టే విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) అనుచరులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి (Nara Bharath Reddy) వర్గీయులకు మధ్య వాగ్వాదం మొదలైంది. గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలోనే ఈ గొడవ జరగడంతో పరిస్థితి వేగంగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు గన్‌మెన్ దగ్గర నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ తీవ్రంగా గాయపడి మరణించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయడంతో పాటు గాలిలోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Next Story