- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: బళ్లారి కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఎస్పీ ఆత్మహత్యాయత్నం
బళ్లారి కాల్పుల ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదు అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని బళ్లారి కాల్పుల ఘటనలో (Ballari Firing Incident) ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కర్ణాటక ప్రభుత్వం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్‍పై (Ballari SP Pawan Nijjur) సస్పెండ్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్పీ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నానికి (SP Suicide Attempt) పాల్పడ్డాడు. తుముకూరులోని ఓ ఫామ్ హౌస్ లో ఆయన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో గురువారం రాత్రి గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బళ్లారి ఈ ఘటనతో ఒక్కసారిగా రణరంగంగా మారింది.
ఎస్పీని బాధ్యుడ్ని చేయడంపై విమర్శలు:
సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఎస్పీ పవన్ నిజ్జూర్ పై చర్యలు తీసుకుంది. అయితే గురువారమే నిజ్జూర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా చార్జ్ తీసుకున్న గంటల్లోనే ఈ కాల్పుల ఘటన జరగడం ఆ వెంటనే ఆయనపై సస్పెన్స్ వేటు పడటం అంతా నాటకీయ పరిణామంగా మారింది. ఈ వ్యవహారంలో ఎస్పీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు సైతం వస్తున్నాయి.






