Beef: ఏఎంయూ మెనూలో బీఫ్ బిర్యానీ.. సోషల్ మీడియాలో నోటీస్ వైరల్ కావడంతో వివాదం

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో వివాదం నెలకొంది.

Beef: ఏఎంయూ మెనూలో బీఫ్ బిర్యానీ.. సోషల్ మీడియాలో నోటీస్ వైరల్ కావడంతో వివాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో వివాదం నెలకొంది. ఆదివారం భోజనంలో చికెన్ బిర్యానీకి బదులుగా బీఫ్ బిర్యానీ (Beef biryani)ని ఉంచుతామనే నోటీస్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ కావడంతో ఒక్క సారిగా కలకలం రేగింది. విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నోటీసు జారీ చేసినట్టు ఉంది. దీంతో అధికారిక యంత్రాంగం వెంటనే స్పందిచింది. టైపింగ్ మిస్టేక్ వల్ల ఈ తప్పిదం జరిగిందని తెలిపింది. దీనికి బాధ్యులైన వారికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. సర్ షా సులైమాన్ హాల్‌ (Sir Shah Sulaiman Hall)లో విద్యార్థులు ఈ నోటీసును కనుగొన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరగడంతో పాలనా యంత్రాంగం స్పందించి వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విశ్వ విద్యాలయం తీవ్రవాద అంశాలను ప్రోత్సహిస్తోందని బీజేపీ సీనియర్ నేత నిషిత్ శర్మ మండిపడ్డారు.

Next Story