Beating retreat : వాఘా సరిహద్ధులో భారత్ పాక్ సైనికుల బీటింగ్ రిట్రీట్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-27 14:31:37  IST  )

ఏటా గణతంత్ర దినోత్సవ(Republic Day) వేళ పంజాబ్‌లోని అట్టారీ వాఘా సరిహద్ధు(Wagah Border)లో నిర్వహించే భారత్-పాకిస్తాన్(India–Pakistan) దేశాల సైనిక బలగాల బీటింగ్ రిట్రీట్(Beating Retreat)ప్రదర్శన భావోద్వేగంగా సాగింది.

Beating retreat : వాఘా సరిహద్ధులో భారత్ పాక్ సైనికుల బీటింగ్ రిట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏటా గణతంత్ర దినోత్సవ(Republic Day) వేళ పంజాబ్‌లోని అట్టారీ వాఘా సరిహద్ధు(Wagah Border)లో నిర్వహించే భారత్-పాకిస్తాన్(India–Pakistan) దేశాల సైనిక బలగాల బీటింగ్ రిట్రీట్(Beating Retreat)ప్రదర్శన భావోద్వేగంగా సాగింది. ఇరుదేశాల సైనికులు సరిహద్ధు వద్ధ నిర్వహించిన ఈ ప్రదర్శనకు రెండు దేశాలకు చెందిన వేలాది మంది పౌరులు పాల్గొని ఉత్సాహంగా తిలకించారు. రెండు దేశాల సైనికులు, పౌరులు తమ దేశాలకు మద్ధతుగా నిర్వహించిన నినాదాలతో సరిహద్ధులు ప్రతిధ్వనించాయి.

బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో భాగంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు , పాక్‌ రేంజర్లు బోర్డర్‌ సైనికుల కవాతులో పోటీ పడి మరి కదం తొక్కడం అందరిని ఆకట్టుకుంది. స భారత సైనికుల శక్తిని, పౌరుషాన్ని ఈ ప్రదర్శన కళ్లకు కట్టింది. బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.


Click Here For Tweet..

Next Story