లిప్‌స్టిక్‌,ఫేస్ క్రీమ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. ఆరోగ్య‌శాఖ మంత్రి హెచ్చరిక!

by Jakkula.Mamatha |

ప్రస్తుత కాలంలో ఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో యువత ఫేస్‌క్రీములు యూజ్ చేస్తుండటం తెలిసిన విషయమే.

లిప్‌స్టిక్‌,ఫేస్ క్రీమ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. ఆరోగ్య‌శాఖ మంత్రి హెచ్చరిక!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో యువత ఫేస్‌క్రీములు యూజ్ చేస్తుండటం తెలిసిన విషయమే. ఈ క్రమంలో కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి(Kerala Health Minister) వీణా జార్జ్(Veena George) ఓ హెచ్చ‌రిక జారీ చేశారు. లిప్‌స్టిక్‌, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవ‌ల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు కేరళ మంత్రి వీణా జార్జ్(Veena George) తెలిపారు. ఈ క్రమంలో కాస్మ‌ోటిక్ ఉత్ప‌త్తులను కొనుగొలు చేసే ముందు లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. ఆ ఉత్ప‌త్తుల్లో(Cosmetic Products) అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్న‌ట్లు.. అవి కేర‌ళ‌ రాష్ట్రంలో అమ్ముతున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్రోడ‌క్ట్‌ను కొనేముందు ఉత్ప‌త్తిదారుడి అడ్ర‌స్‌ను తప్పకుండా తెలుసుకోవాల‌న్నారు.

కేర‌ళ రాష్ట్ర‌వ్యాప్తంగా 2023లో ‘‘ఆప‌రేష‌న్ సౌంద‌ర్య‌’’ను మొద‌లుపెట్టారని తెలిపారు. కాస్మ‌ోటిక్ ఉత్ప‌త్తు(cosmetic products)ల్లో ప్ర‌మాదక‌ర కెమిక‌ల్స్ ఉన్నాయా? అనే కోణంలో పరిశీలిన జరుపుతున్నాం అన్నారు. ప్రమాదకర కెమికల్స్ ఉన్న ఫేక్ ఉత్ప‌త్తుల్ని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. లిప్‌స్టిక్‌, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవ‌ల్స్ ఉన్న‌ట్లు ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో గుర్తించడం జరిగిందన్నారు. కొన్ని శ్యాంపిళ్ల‌లో మెర్క్కూరీ లెవల్స్(Mercury levels) సుమారు 12,000 రెట్లు అధికంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇలాంటి ప్ర‌మాదక‌ర ర‌సాయ‌నాల వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు, అవ‌య‌వాలు డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అయితే.. మెర్క్యూరీ ఎక్కువగా ఉన్న ఉత్ప‌త్తుల్ని వాడ‌డం వ‌ల్ల‌.. చ‌ర్మం రంగు మారడం, చర్మం పై ఎరుపు గుళ్ల‌లు ఏర్పడతాయి. ఉద‌ర‌, నాడీ, ఇమ్యూన్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్రమాదం ఉంది. కొన్ని సంద‌ర్భాల్లో డిప్రెష‌న్ కూడా వ‌స్తుంద‌ని యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్టు (UN Environment Program Report) ద్వారా తెలుస్తోంది. ఉత్ప‌త్తుల‌పై మెర్క్యూరియ‌స్ క్లోరైడ్‌, మెర్క్యూరీ, మెర్క్యూరిక్‌, మెర్క్యూరియో, క‌లోమెల్ అని రాసి ఉంటుంది. అలా రాసి ఉంటేనే కొనాలి. లేకపోతే ఆ ఉత్ప‌త్తుల‌తో స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. ఇంగ్లీష్ భాష‌లో లేదా స్థానిక భాష‌లో ఉత్ప‌త్తిపై రాసి లేకుంటే దాన్ని కొన‌వ‌ద్దని సూచించారు.

Next Story