- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varanasi: బెనారస్ విశ్వవిద్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(Banaras University)లో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగ(Bathukamma Festival)ను ఘనంగా జరుపుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(Banaras University)లో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగ(Bathukamma Festival)ను ఘనంగా జరుపుకున్నారు. విశ్వవిద్యాలయంలోని బిర్లా మందిర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఆచార్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. 109 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ ఉత్సవాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ బతుకమ్మ సంబరాలు, భారతదేశ సంస్కృతి-సాంప్రదాయాలకు పట్టుగొమ్మగానున్న ఈ విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం హర్షించదగిన విషయమని ఆచార్య జె.బి. కొమురయ్య, డా. గట్ల ప్రవీణ్, డా. గోసికొండ శ్రీరాములు అన్నారు. అలాగే, ఇక నుండి బతుకమ్మ సంబరాలు ప్రతీ ఏటా నిర్వహించి, తెలంగాణ పండుగలను ఇక్కడి విద్యార్థులకు పరిచయం చేయాలని నిర్ణయించారన్నారు. వీటికి తెలంగాణ సహాయ సహకారాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.






