Bastar : బస్తర్‌లో భారీగా తగ్గిన నక్సల్స్ : కేంద్ర ప్రభుత్వం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-29 12:43:21  IST  )

కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బస్తర్(Bastar) జిల్లాను నక్సల్ ప్రభావం భారీగా తగ్గినట్టు పేర్కొంది.

Bastar : బస్తర్‌లో భారీగా తగ్గిన నక్సల్స్ : కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బస్తర్(Bastar) జిల్లాలో నక్సల్ ప్రభావం భారీగా తగ్గినట్టు పేర్కొంది. దేశంలో నక్సల్ కార్యకలాపాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా ఇది పరిగణించబడుతోంది. గత 18 నెలల్లో.. నక్సలిజం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు కలిసి ఆపరేషన్ కగార్(Operation Kagar) ను చేపట్టాయి. మావోయిస్టులను ఏరిపారేయడమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్లో భారీగా నక్సల్స్ హతం అయ్యారు. వందల సంఖ్యలో నక్సల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్(Bastar IG P. Sundarraj) మాట్లాడుతూ.. సీపీఐ-మావోయిస్ట్ సంస్థపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ల ఫలితంగా బస్తర్‌తో పాటు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నక్సల్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు.

బస్తర్ డివిజన్‌లోని నాలుగు జిల్లాలు - బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, కాంకెర్లు వామపక్ష తీవ్రవాదం(LWE) చాలా ఎక్కువగా ఉన్న జిల్లాలుగా గుర్తించామని అన్నారు. అలాగే, బస్తర్, ధమతారి, రాజ్‌నంద్‌గావ్‌తో సహా ఛత్తీస్‌గఢ్‌లోని ఆరు జిల్లాల్లో నక్సల్ కార్యకలాపాలు మళ్లీ పెరగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నామని ఐజీ తెలిపారు. దేశవ్యాప్తంగా, కేవలం 18 జిల్లాలు మాత్రమే నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని. 28 జిల్లాలు "మాక్సిమమ్ త్రస్ట్ డిస్ట్రిక్ట్స్" జాబితాలో ఉన్నాయని ప్రకటించారు. "మాక్సిమమ్ త్రస్ట్ డిస్ట్రిక్ట్" అంటే ఆ జిల్లాలో నక్సల్ కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని అర్థం.

https://x.com/ANI/status/1927688037481185593

Next Story