- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను వంటగదిలోకి రానివ్వకపోవడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు కీలక తీర్పు
భార్యను వంటగదిలోకి రానివ్వకపోవడం మానసిక క్రూరత్వమేనని ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: మెట్టినింట్లో భార్యను వంటగదిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం లేదా ఆమెను వంట చేయనివ్వకుండా నిరోధించడం కచ్చితంగా క్రూరత్వం కిందకే వస్తుందని ముంబై హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పును వెలువరించింది. ఇలాంటి చర్యలు సదరు మహిళను మానసికంగా వేధించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. నాగ్‌పూర్ (Nagpur)కు చెందిన ఓ మహిళ మహిళ తన భర్త, అత్తగారిపై పెట్టిన వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన భర్త తనను వంటగది (Kitchen)లోకి వెళ్లనివ్వడం లేదని, నగలను పారేశారని, పుట్టింటికి కూడా పంపడం లేదని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే నేతృత్వంలోని ధర్మాసనం.. భార్య పట్ల భర్త వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.
ఓ మహిళను తన సొంత ఇంట్లో వంట గదిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కోర్టు పేర్కొంది. బయటి నుంచి ఆహారం తెప్పించుకోవాల్సిన పరిస్థితి కల్పించడం, ఆమె కదలికలపై నిఘా ఉంచడం వంటివి మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని అన్నారు. అయితే, అత్తగారిపై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది. కానీ, భర్తపై ఉన్న అభియోగాలను కొట్టివేయడానికి నిరాకరించింది. భార్యపై భౌతిక దాడి జరగకపోయినా, ఆమెను ఇంట్లో కనీస పనులు చేసుకోనీయకుండా మానసికంగా వేధించడం చట్టరీత్యా తప్పని, అది క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.






