క్షీణించిన పరిస్థితులు.. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ రాయబారి వాపస్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-30 02:41:20  IST  )

భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా పనిచేస్తున్న రియాజ్ హమీదుల్లాను బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా వెనక్కి రావాలని పిలుపునిచ్చింది.

క్షీణించిన పరిస్థితులు.. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ రాయబారి వాపస్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు (Tense situations) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌ (Bangladesh High Commissioner)గా పనిచేస్తున్న రియాజ్ హమీదుల్లా (Riyaz Hamidullah)ను బంగ్లాదేశ్ ప్రభుత్వం (Government of Bangladesh) అత్యవసరంగా వెనక్కి రావాలని పిలుపునిచ్చింది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) నుండి అందిన ఆదేశాల మేరకు ఆయన సోమవారం రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ లోని కీలక వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకే ఆయన్ని పిలిపించి నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి ప్రముఖ దిన పత్రికలో' ప్రచురించారు. సరిహద్దు సమస్యలు, ఇటీవల తలెత్తిన దౌత్యపరమైన వివాదాల నేపథ్యంలో, తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More..

అల్లర్ల వేళ బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Next Story