- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లర్ల వేళ బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢాకాలోని ఎవర్‌కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. గత నవంబర్ నుంచి ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి ఇటీవల మరింత క్షీణించింది. డిసెంబర్ ప్రారంభంలో వెంటిలేటర్ సపోర్టుపై ఉండటం వల్ల ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా మారడంతో ఇవాళ ఆమె కన్నుమూశారు.
కాగా, బేగం ఖలీదా జియా 1991-1996, 2001-2006 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌కు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఆమె భర్త జియావుర్ రహ్మాన్ మరణం తర్వాత బీఎన్‌పీ పార్టీకి నాయకత్వ బాధ్యత చేపట్టి, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఆమె మరణం పట్ల ప్రధాని మోడీతో పాటు పొరుగు దేశాల ప్రధానులు సంతాపం తెలిపారు. మరోవైసు ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ యాక్టింగ్ చీఫ్ తారిక్ రహమాన్ లండన్ నుంచి 17 ఏళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. ఫిబ్రవరిలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ ఖలీదా జియా మరణం పోలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
క్షీణించిన పరిస్థితులు.. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ రాయబారి వాపస్






