Bengal violence: ముర్షీదాబాద్ హింసలో బంగ్లాదేశీయుల హస్తం

by Shamantha N |
Bengal violence: ముర్షీదాబాద్ హింసలో బంగ్లాదేశీయుల హస్తం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్(west bengal)లోని ముర్షీదాబాద్(Murshidabad)లో చెలరేగిన హింసపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్‌ (సవరణ) చట్టం (Waqf Act) అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. అయితే, దీని బంగ్లాదేశ్(Bangladeshi) హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని తేలిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందిందని సంబంధితవర్గాలు తెలిపాయి. వక్ఫ్‌ (సవరణ) చట్టం (Waqf Act) అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన నిరసనలను మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుతవ చొరబాటుదారులను పర్యవేక్షించడంలో విఫలమైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రవాద సంస్థలు యువకులను ఈ హింసలో భాగం చేశాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.

వక్ఫ్ చట్టంపై నిరసనలు

కాగా.. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్‌లో గత వారం నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు ఉద్రిక్తతగా మారడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్టు చేశారు. కాగా.. రాళ్ల దాడి చేసిన వారు ఎక్కువగా 20 ఏళ్ల లోపు వారేనని ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు. కానీ, తానెప్పుడూ వారిని చూడలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వాస్తవాలేంటో బయటపెడతామని ఒక సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.



Next Story

Most Viewed