- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఇళ్లు ధ్వంసం !
అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇళ్లును ముట్టడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇళ్లును ఆందోళన కారులు ముట్టడించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢాకాలోని ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇంటిని తగులబెట్టినట్టు కూడా పలు కథనాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ (Awami League) గురువారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే హింస నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రెహమాన్‌కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.






