భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో మరో డిమాండ్..

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో రోజురోజుకూ భారత్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న యూనస్ సర్కారు ధోరణితో.. ఇరుదేశాల మధ్యనున్న సంబంధాలు క్షీణిస్తున్న క్రమంలో.. అక్కడి వస్త్ర పరిశ్రమ నూలు దిగుమతులపై ఆంక్షలకు పట్టుబడుతోంది.

భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో మరో డిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో రోజురోజుకూ భారత్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న యూనస్ సర్కారు ధోరణితో.. ఇరుదేశాల మధ్యనున్న సంబంధాలు క్షీణిస్తున్న క్రమంలో.. అక్కడి వస్త్ర పరిశ్రమ నూలు దిగుమతులపై ఆంక్షలకు పట్టుబడుతోంది. భారత్ నూలుకు ఇస్తున్న డ్యూటీ ఫ్రీ ను వెంటనే తొలగించాలని, ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి ఫ్యాక్టరీలను మూసివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య శాఖ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు లేఖ అందినట్లు యూనస్ సర్కార్ పేర్కొంది. డ్యూటీ ఫ్రీ సదుపాయంతో భారత్ నూలు తమ దేశంలోకి చౌకగా వస్తోందని, ఇది స్థానిక స్పిన్నింగ్ యూనిట్ల ఆదాయాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి 12 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన నిల్వలు అమ్ముడుపోకుండా అలాగే ఉన్నాయని, 50కి పైగా వస్త్రదుకాణాలు మూతపడి, వేలాది మంది నిరుద్యోగులుగా మారారని ఆరోపించారు. కాగా.. డ్యూటీ ఫ్రీ ఎత్తివేయాలన్న డిమాండ్ ను బంగ్లాదేశ్ ఎగుమతిదారుల సంఘం వ్యతిరేకిస్తోంది. అలా చేస్తే భారత్ నుంచి నూలు దిగుమతులు తగ్గుతాయని తెలిపింది. ప్రపంచదేశాలు, అంతర్జాతీయ బ్రాండ్లు భారత్ నూలుకు ప్రాధాన్యమిస్తోంటే మనం దానిని వదులుకున్నవారమవుతామని హెచ్చరించింది. నూలు దిగుమతులు తగ్గితే.. బట్టల్లో నాణ్య, ఖరీదులో ప్రపంచ టెక్స్ టైల్ మార్కెట్ లో నిలబడలేమని పేర్కొంది.

Next Story