భారత రాయబారికి సమన్లు జారీ చేసిన బంగ్లాదేశ్

by Ajay Maddhiboyina |

ఇటీవల బంగ్లా సరిహద్దు వద్ద భారత్‌కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన కార్యాకలాపాల వల్ల తాము ఆందోళన చెందుతున్నట్లు బంగ్లాదేశ్ సమన్లలో పేర్కొంది.

భారత రాయబారికి సమన్లు జారీ చేసిన బంగ్లాదేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో:

సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఇటీవల బంగ్లా సరిహద్దు వద్ద భారత్‌కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన కార్యాకలాపాల వల్ల తాము ఆందోళన చెందుతున్నట్లు బంగ్లాదేశ్ సమన్లలో పేర్కొంది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని కోరడంతో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి జషీమ్ ఉద్దీన్‌ను కలిసి 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. భారత్ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా బార్డర్ వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకు ముందు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశం అనంతరం ప్రణయ్ వర్మ మాట్లాడుతూ సరిహద్దుల వెంబటి కంచె వేసే విషయమై ఢిల్లీ-ఢాకా మధ్య అవగాహన ఉందని తెలిపారు. ఇరు దేశాల సరిహద్దును కాపాలాకాస్తున్న బీఎస్ఎఫ్, బీజీబీ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాయని వర్మ స్పష్టం చేశారు. భారత్, బంగ్లా మధ్య స్మగ్లింగ్, ట్రాఫికింగ్ వంటివి జరుగకుండా నేర రహిత సరిహద్దును కొనసాగించడానికి ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని ఆయన చెప్పారు.

Next Story