బంగ్లాలో ఆర్మీలో భారీ మార్పులు.. ఇండియాలోని అధికారికి ప్రమోషన్!

by velandi.Saikiran |

ఇండియాలోని అధికారికి ప్ర‌మోష‌న్ ఇచ్చింద‌ట‌. బంగ్లా డిఫెన్స్ అడ్వైజర్ గా ఉన్న మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ నియామ‌కం అయ్యారు.

బంగ్లాలో ఆర్మీలో భారీ మార్పులు.. ఇండియాలోని అధికారికి ప్రమోషన్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బంగ్లాదేశ్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఆర్మీలో కూడా భారీ మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రహమాన్ తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన బంగ్లాదేశ్ సైన్యంలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ ఆర్మీలో మార్పులు..ఇండియాలోని అధికారికి ప్ర‌మోష‌న్ !

ముఖ్యంగా ఇండియాలోని అధికారికి ప్ర‌మోష‌న్ ఇచ్చింద‌ట‌. బంగ్లాదేశ్‌ డిఫెన్స్ అడ్వైజర్ గా ఉన్న మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ ను వెనక్కి పిలిపించి, కీలక పదవి కట్టబెట్టారు. ఆయనకు బంగ్లాదేశ్ మేజర్ జనరల్ గా ప్రమోషన్ కూడా ఇచ్చారు కొత్త ప్రధాని తారిక్. కొత్త సీజీఎస్ తో పాటు మిలిటరీ ఇంటలిజెన్స్ కు కూడా కొత్త అధికారులను తారిక్ రహమాన్ నియామకం చేశారట. కొత్తగా ఏర్పడ్డ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం తన పట్టు పెంచుకునే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా 23 శాతం సీట్లు సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 17 ఏళ్ల త‌ర్వాత పీఠం ద‌క్కించుకుంది.

Next Story