- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం..హిందూ వ్యాపారవేత్త హత్య
బంగ్లాదేశ్ లో ప్రముఖ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా పొడిచి చంపారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. హిందువులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు బంగ్లాదేశ్ ముస్లింలు. ఇప్పటికే చాలామంది హిందువులు బంగ్లాదేశ్ లో మరణించారు. మారణకాండ ఆపాలని ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంత మేరకు రిక్వెస్ట్ చేసిన... బంగ్లాదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా బంగ్లాదేశ్ లో మరో వ్యక్తిపై దారుణం జరిగింది.
బంగ్లాదేశ్ లో ప్రముఖ వ్యాపారి దారుణ హత్య
బంగ్లాదేశ్ లో ప్రముఖ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా పొడిచి చంపారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హత్యకు గురైన సదరు వ్యక్తి ప్రముఖ వ్యాపారి అని.. అతని పేరు సుసేన్ చంద్రశేఖర్ గా గుర్తించారు. సోమవారం రోజు అర్ధరాత్రి చంద్రశేఖర్ పైన దాడి జరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో ఉన్న బోగర్ బజార్ లో బియ్యం దుకాణం నడిపిస్తున్నాడు చంద్రశేఖర్. అయితే రాత్రి సమయంలో అతడు దుకాణంలో ఉండగానే లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆ తర్వాత ఒక్కడిని చేసి, అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. హత్య చేసిన తర్వాత చంద్రశేఖర్ దుకాణానికి సంబంధించిన తలుపులు మూసివేసి, ఆ నిందితులు పారిపోయారని కెమెరాలలో రికార్డయింది. ఇక ఎంతసేపు అయినా చంద్రశేఖర్ ఇంటికి రాకపోవడంతో... ఆ హిందూ బాధిత కుటుంబం దుకాణానికి వెళ్ళింది.
ఆ సమయంలో రక్తపు మడుగులో చంద్రశేఖర్ ను చూసి, ఆ బాధిత కుటుంబం కన్నీరు మున్నీరు అయింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు ఆర్ట్ అయి చంద్రశేఖర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చంద్రశేఖర్ అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. చంద్రశేఖర్ ను చంపేసిన తర్వాత అతని దుకాణంలో ఉన్న డబ్బులను కూడా దుండగులు దొంగిలించారట. అయితే ఈ హత్య దొంగతనం కోసం జరిగిందా? హిందుత్వ దాడిలో భాగంగా జరిగిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.






