ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

by Muthe.Rajitha |

గతేడాది బంగ్లా అల్లర్ల వ్యవహారం తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే.

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు
X

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది బంగ్లా అల్లర్ల వ్యవహారం తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. అయితే తాజాగా బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిపేందుకు సిద్ధం అవుతోంది అక్కడి ప్రభుత్వం. ఫిబ్రవరి 12న ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఆ రోజు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామని, ఇక అదే రోజు "జులై చార్టర్"పై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుపుతామని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నజీర్ ఉద్దీన్ నేడు వెల్లడించారు.

Next Story