- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: భారత్ సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్
భారత్ సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లు కలకలం రేపాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను మోహరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లు కలకలం రేపాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను మోహరించింది. భారత్‌తో సరిహద్దుకు సమీపంలో బైరక్టార్ టీబీ2 (Bayraktar TB2) మానవరహిత వైమానిక వాహనాల (UAV)లను మోహరించిన్టలు సైన్యం ద్రువీకరించింది. బంగ్లాదేశ్‌లోని 67వ సైన్యం నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు అని ఢాకా చెబుతోంది. అయితే, సున్నితమైన ప్రాంతంలో అలాంటి అధునాతన డ్రోన్లను ఉంచడంతో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత భద్రతాబలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో అశాంతి నేపథ్యంలో సాయుధ దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక, డ్రోన్ విస్తరణలను నిశితంగా అంచనా వేస్తున్నామన్నారు. హెరాన్ టీపీ(Heron TP) వంటి డ్రోన్‌లను మోహరించే అవకాశం ఉందని చెప్పారు. "మేం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. సరిహద్దుల్లో భద్రత కోసంఅవసరమైన ప్రతిచర్యలు తీసుకుంటాం" అని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత్ కూడా గూఢచార-భాగస్వామ్య యంత్రాంగాలను,అంతర్జాతీయ భాగస్వాముల సహకారాన్ని తీసుకుంటుందన్నారు.
ఇంటెలిజెన్స్ నివేదికలు
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి, సమయంతో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించడం గమనార్హం. బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశ వ్యతిరేక అంశాలు పెరిగాయని పేర్కొన్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ బైరక్టార్ టీబీ2 డ్రోన్‌లు కొనుగోలు చేసింది. దీంతో, నిఘా, తేలికపాటి దాడుల కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని బంగ్లా సైన్యం పెంచుకొంది పెంచుకున్నాయి. డిఫెన్స్ టెక్నాలజీ ఆఫ్ బంగ్లాదేశ్ (DTB) ప్రకారం కొనుగోలు చేసిన 12 డ్రోన్‌లలో 6 పనిచేస్తున్నాయి.






