- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ నటి పాడు పని.. ఏపీకి చెందిన వాళ్లు తన తల్లిదండ్రులంటూ డ్రామాలు..
బంగ్లాదేశ్ నటి శాంతా పాల్‌ను కోల్‌కతాలో అరెస్ట్ చేశారు పోలీసులు. జూలై 30న ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు ఆధార్ కార్డులు, ఇండియన్ ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, అడ్మిట్ కార్డ్స్, బంగ్లాదేశ్ పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ నటి శాంతా పాల్‌ను కోల్‌కతాలో అరెస్ట్ చేశారు పోలీసులు. జూలై 30న ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు ఆధార్ కార్డులు, ఇండియన్ ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, అడ్మిట్ కార్డ్స్, బంగ్లాదేశ్ పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. శాంతా పాల్ రెండేళ్లుగా ఇండియాలో అక్రమంగా నివసిస్తోందని.. భారతీయ పౌరసత్వం కలిగి ఉందని నటిస్తూ కార్ రెంటల్ వ్యాపారం నడిపిస్తున్నట్లు కనుగొన్నారు. ముందుగా పార్క్ స్ట్రీట్‌లో.. అనంతరం జడవ్‌పూర్‌లోని బిక్రమ్ గఢ్‌లో ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని ఉందని తేలింది. అయితే ఫారిన్ వెళ్లేందుకు ఇండియన్ పాస్ పోర్ట్ పొందేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కోల్‌కతా పోలీసులు ఆంటీ-రౌడీ సెక్షన్ దాడిలో ఆమె దగ్గర ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఫేక్ ఐడీలను సమకూర్చిన ఏజెంట్‌ను.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పబడుతున్న భర్త, తల్లిదండ్రుల కనెక్షన్ గురించి విచారిస్తున్నారు. కాగా ఆమె ఈ నెల 8వరకు పోలీసుల కస్టడీలో ఉండనుంది.






