- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకవైపు భూకంపం.. రోడ్డుపైనే ప్రసవం చేసిన డాక్టర్లు
సివిల్ ఇంజనీర్లు హాస్పిటల్ బిల్డింగ్ పటిష్టత బాగానే ఉందని నిర్ధారించిన తర్వాత వారిని వార్డుల్లోకి షిఫ్ట్ చేశారు.

- బ్యాంకాక్ వీధుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- భూకంకం రావడంతో రోడ్డుపైనే డెలివరీ
- వైరల్‌గా మారిన వీడియో
దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్, థాయిలాండ్ దేశాలను శుక్రవారం పెను భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో 1000 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపైనే ఒక మహిళకు వైద్య సిబ్బంది డెలివరీ చేశారు. నిండు చూలాలైన ఒక మహిళ థాయిలాండ్ జనరల్ హాస్పిటల్‌కు వచ్చింది. ఆమెకు డెలివరీ చేయడానికి వైద్యులు సిద్దపడుతుండగా భారీ భూకంపం వచ్చింది. దీంతో ఆమెను అలాగే స్ట్రెచర్‌పై ఆసుపత్రి నుంచి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. స్ట్రెచర్ చుట్టూ వైద్య సిబ్బంది నిలబడి.. సదరు మహిళకు డెలివరీ చేశారు. ఆ మహిళ పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీస్ కల్నల్ సిరికుల్ స్రిసాంజే తెలిపారు.
కాగా, ఈ బిడ్డ రోడ్డు మీదే జన్మించినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్ట్రెచర్ మీద పడుకొని ఉన్న మహిళ, ఆమె చుట్టూ వైద్య సిబ్బంది ఉండగా.. బయట రోడ్డు మీదే బిడ్డకు జన్మనివ్వడం ఆ వీడియోలో కనిపించింది. అదే ఫుటేజీలో చాలా మంది పేషెంట్లు బెడ్లపై రోడ్డు పక్కన పడుకొని ఉండగా.. వారికి వైద్యులు చికిత్స చేస్తున్న దృశ్యాలు కూడా కనపడ్డాయి. భూకంపం వచ్చినా వైద్యులు తమ పేషెంట్లకు చికిత్స చేస్తుండటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, మహిళకు సిజేరియన్ చేస్తున్న సమయంలో భూకంపం వచ్చిందని.. ఆమెను అలాగే కిందకు తీసుకొని వచ్చి బిడ్డను బయటకు తీసి, కుట్లు వేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత పేషెంట్‌ను సురక్షితమైన ప్రదేశాలకు తరలించినట్లు చెప్పారు. సివిల్ ఇంజనీర్లు హాస్పిటల్ బిల్డింగ్ పటిష్టత బాగానే ఉందని నిర్ధారించిన తర్వాత వారిని వార్డుల్లోకి షిఫ్ట్ చేశారు.






